SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    5G spectrum | టాప్ బిడ్డర్‌గా రిలయన్స్ జియో.. అక్టోబర్‌ నుంచి 5జీ సర్వీసులు

    3 years ago

    ఏడు రోజుల పాటు కొనసాగిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం సోమవారంతో ముగిసింది. ముగిసిన 5జీ వేలంతో రూ. 1.5 లక్షల కోట్లను ఆర్జించింది. ఈ నెల 15 నాటికి ఈ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తవుతాయని, మొత్తం 5Gతో దేశం మొత్తాన్ని కవర్‌ చేయడానికి సరిపోతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. అక్టోబర్‌ నుంచి 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ వేలంలో టాప్ బిడ్డర్‌గా రిలయన్స్ జియో నిలిచింది. ఈ కంపెనీ రూ. 88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కోసం బిడ్స్ వేసింది. రూ. 43,084 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కోసం ఎయిర్‌టెల్‌, రూ. 18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కోసం వొడాఫోన్ ఐడియా (వీ) లు బిడ్స్ వేశాయి. గౌతమ్ అదానీ కంపెనీ 400 మెగా హెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ కోసం రూ. 212 కోట్లను ఖర్చు చేసింది. ఏడు రోజుల్లో మొత్తం 40 రౌండ్ల స్పెక్ట్రమ్‌ వేలం పాటలు జరిగాయి. దేశంలోని 22 సర్కిళ్లలోనూ 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.88,078 కోట్ల విలువైన బిడ్లు వేసింది. 6-10 కి.మీ. పరిధిలో సిగ్నల్ అందించగల 700 మెగాహెర్జ్ తో పాటు, 800, 1800, 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్లలో కలిపి 24.740 మెగాహెర్జ్ స్పెక్ట్రం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.7.877 కోట్లు చెల్లించాల్సి ఉంది.
    Click here to Read more
    Prev Article
    దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు.. జూలైలో ఏకంగా 600 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు
    Next Article
    World News Live Updates: Hundreds Of Historic Ships Arrive In Amsterdam For Maritime Festival

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment